
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 51


మరోసారి సంక్రాంతికి రానున్న `డిస్కో రాజా`?

మారుతి డైరెక్షన్ లో మెగా హీరో?

చిరంజీవి టైటిల్స్‌తో వస్తున్న కొత్త చిత్రాలు

‘అర్జున్ సురవరం’ ముఖ్య అతిథి ఎవరంటే...!

1మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన ‘జెర్సీ’

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

విజయ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో!

నువ్వు తోపురా రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో సీక్వెల్స్ సందడి

మహేష్ #26 - అప్పుడు తండ్రి ఇప్పుడు విలన్!

దర్బార్ మూవీ షూటింగ్ లో నయనతార

మెగాస్టార్ చిత్రంలో అనసూయ?

యన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’కు 26 ఏళ్ళు

హీరో నాని, స్వప్న దత్ నిర్మాతలుగా కామెడీ మూవీ

ప్రభాస్‘డార్లింగ్’కు 9 ఏళ్ళు

డైరెక్టర్‌గా మారనున్న కంప్లీట్ యాక్టర్

కోలీవుడ్ మూవీ లో విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్
దక్షిణాది భాషల సినిమాలలో బాలీవుడ్ హీరోలు ప్రతి నాయకుడిగా నటించడం కొత్తకాదు. రీసెంట్ గా 2.0 మూవీ లో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కోలీవుడ్ కు విలన్ గా పరిచయమవుతున్నారు. AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న దళపతి 63 మూవీ దీపావళి పండుగకు రిలీజ్ కానుంది. హీరో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ మూవీ కై చెన్నై లో EVP స్టూడియో లో భారీ ఫుట్ బాల్ స్టేడియం సెట్ ను రూపొందించారు.

మరోసారి సంక్రాంతికి రానున్న `డిస్కో రాజా`?
మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంతేకాదు… పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వీఐ ఆనంద్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ఓ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. కాగా… తదుపరి షెడ్యూల్ మే మూడో వారం నుంచి జరుగనుందని సమాచారం. ఆ పై శరవేగంగా చిత్రీకరణ జరిపి… వి.ఎఫ్.ఎక్స్ వర్క్‌పై దృష్టి సారించనున్నారని తెలిసింది. అలాగే… సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు…

మారుతి డైరెక్షన్ లో మెగా హీరో?
ఎట్టకేలకు సాయి తేజ్ కు చిత్రలహరి సినిమాతో పెద్ద రిలీఫే దొరికింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాప్ లతో సతమతమవుతున్న ఈ యంగ్ హీరోకు ఈసారి మాత్రం హిట్ తప్పనిసరైంది. అలాంటి పరిస్థితుల్లో తన ఆశలన్నీ చిత్రలహరి సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక తన అంచనాలను నిజం చేస్తూ మంచి టాక్ నే సంపాదించుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.

చిరంజీవి టైటిల్స్‌తో వస్తున్న కొత్త చిత్రాలు
ప్రజాదరణ పొందిన పాత సినిమాల టైటిల్స్‌తో కొత్త చిత్రాలు రావడం తెలుగు పరిశ్రమలో కొత్తేమీ కాదు. అనాదిగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే.. ఒకే కథానాయకుడికి సంబంధించిన పాత సినిమాల టైటిల్స్‌తో అరడజను కొత్త చిత్రాలు ఒకే ఏడాదిలో రావడం మాత్రం అరుదే. ఆ హీరో మెగాస్టార్ చిరంజీవి కాగా… ఆ చిత్రాలు ప్రాణం ఖరీదు, గ్యాంగ్ లీడర్, రాక్షసుడు, హీరో, జ్వాల, ఖైదీ.

ఒకే రోజున ఇద్దరు తెలుగు దర్శకుల తొలి హిందీ చిత్రాలు
జూన్ 21, 2019… ఓ అరుదైన విషయానికి వేదిక కానుంది. అదేమిటంటే… అదే రోజున టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు యువ దర్శకులు హిందీనాట తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆ దర్శకులు మరెవరో కాదు.. సందీప్ రెడ్డి వంగ, కోవెలమూడి సూర్య ప్రకాష్.అర్జున్ రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన సందీప్… ఇప్పుడు అదే చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

‘అర్జున్ సురవరం’ ముఖ్య అతిథి ఎవరంటే...!
వైవిధ్యభరితమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు నిఖిల్… మరో భిన్నమైన కథతో ‘అర్జున్ సురవరం’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించాడు. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఈ సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే… మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా… ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

1మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన ‘జెర్సీ’
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’… ఇటు ప్రేక్షకులతో పాటు అటు ప్రముఖులను అలరించడమే కాకుండా… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక… ఓవర్సీస్‌లోనూ వసూళ్ళను బౌండరీలను దాటించేస్తోంది. మంగళవారం నాటికి 1మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడమే కాకుండా… ఈ క్లబ్‌లో నానికు డబుల్ హ్యాట్రిక్‌ను అందించింది. ఇప్పటికే నాని నటించిన ‘ఈగ’, ‘భలే.. భలే.. మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘నిన్నుకోరి’, ‘ఎం.సి.ఎ.’ చిత్రాలు కలెక్షన్ల పరంగా‘జెర్సీ’ కంటే ముందున్నాయి. వీటిలో ‘భలే.. భలే…

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. హీరో మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన మహర్షి మూవీ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతీ మూవీస్ బ్యానర్స్ పై రూపొందింది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

విజయ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లే డి హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు.

పోటా పోటీగా జెర్సీ, కాంచన3 కలెక్షన్లు
ఏప్రిల్ నెల టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. గత కొద్ది రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు సూపర్ హిట్స్ అందించాయి. ఇక డబ్బింగ్ సినిమా కాంచన 3 కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు రెండు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఆ సినిమాలు జెర్సీ, కాంచన3. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజై కలెక్షన్లు రాబట్టడంలో పోటా పోటీగా ఉన్నాయి. ముఖ్యంగా బి. సి సెంటర్లలో ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నాయి.

నువ్వు తోపురా రిలీజ్ డేట్ ఫిక్స్
హరినాథ్ బాబు దర్శకత్వంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా పరిచయమైన సుధాకర్ హీరోగా .. నిత్య ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా 'నువ్వు తోపురా'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

టాలీవుడ్ లో సీక్వెల్స్ సందడి
ఒక సినిమా హిట్టయిందంటే చాలు ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడమో.. లేక సీక్వెల్స్ చేయడమే చేస్తుంటారు. ఇది సినీ పరిశ్రమలో ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. అయితే గత కొంత కాలంగా సీక్వెల్స్ కు కొంత బ్రేక్ పడినా.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సీక్వెల్స్ సందడి మొదలైంది. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సీక్వెల్స్ పనిలో పడ్డారు. మరి ఆ సీక్వెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

మహేష్ #26 - అప్పుడు తండ్రి ఇప్పుడు విలన్!
మహేష్ సిల్వర్ జూబ్లి సినిమా మహర్షి కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు టైం కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను.. పాటలను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు.

దర్బార్ మూవీ షూటింగ్ లో నయనతార
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా దర్బార్ మూవీ రూపొందుతుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందే దర్బార్ మూవీ లో తెలుగు, తమిళ చిత్రాల బిజీ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకుడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

‘జెర్సీ’ రీమేక్ కోసం ప్రముఖ నిర్మాతల ప్రయత్నాలు
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని… టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూపొందించాడు. క్రికెట్, తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం… సగటు ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో… ఈ సినిమాను రీమేక్ చేయాలని పలువురు స్టార్ ప్రొడ్యూసర్స్ ఆసక్తిని కనబరుస్తున్నారని సమాచారం.

మెగాస్టార్ చిత్రంలో అనసూయ?
అనసూయ… గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి… ఆపై వెండితెరపైనా తనదైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. తొలుత ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నటించిన అనసూయ… ఆ తర్వాత ‘క్షణం’లో కీలకపాత్ర పోషించింది. అలాగే… ‘విన్నర్’ సినిమాలో “సూయ సూయ అనసూయ’ అనే స్పెషల్ సాంగ్‌లో కూడా నర్తించింది. అనంతరం ‘గాయత్రి’ సినిమాలో మరోసారి కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఒక విధంగా ఈ కీలక పాత్రలే ఆమెకు ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో ‘రంగమ్మత్త’గా నటించే అవకాశాన్ని కల్పించాయి. ఇక ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఎఫ్-2’ మూవీలోనూ ఓ…

యన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’కు 26 ఏళ్ళు
“ఎవడురా! నా భరత జాతిని కప్పమడిగిన తుచ్ఛుడు” అని ఓ అల్లూరిలా ఎదిరించినా…, “ఒరేయ్ తెల్ల కుక్క… కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాల్రా” అని ఓ కట్టబ్రహ్మన్నలా గర్జించినా…, ఓ శివాజీ లా …, ఓ నేతాజీ లా అలరించినా… అది మహానటుడు నందమూరి తారక రామారావు కే చెల్లు. ఒకే పాట కోసం ఇలా పలు చిరస్మరణీయ వ్యక్తుల వ్యక్తిత్వాలను తెరపై ఆవిష్కరించి… మరోసారి మహానటుడు అనే మాటకు సార్థకతకు తీసుకొచ్చారు యన్టీఆర్. ఆ పాట గల చిత్రమే… 1993లో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మేజర్ చంద్రకాంత్’.

హీరో నాని, స్వప్న దత్ నిర్మాతలుగా కామెడీ మూవీ
జెర్సీ మూవీ విజయోత్సాహం లో ఉన్న హీరో నాని, వైజయంతి మూవీస్ అశ్వనీదత్ తనయ, నిర్మాత స్వప్న దత్ సంయుక్తంగా ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ని నిర్మించనున్నారు. పిట్టగోడ మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, షాలిని పాండే ప్రధాన తారాగణం. మూవీ మొత్తం 4 ప్రధాన పాత్రల మధ్య జరుగుతుందని సమాచారం.

ప్రభాస్‘డార్లింగ్’కు 9 ఏళ్ళు
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథలను ఎంచుకోవడం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకత. అలా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించిన ప్రభాస్ చిత్రాలలో ‘డార్లింగ్’ ఒకటి. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ ఎ.కరుణాకరన్ తెరకెక్కించాడు. ప్రభాస్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రంలో… ప్రభు, ‘ఆహుతి’ ప్రసాద్, చంద్రమోహన్, తులసి, శ్రద్ధా దాస్ తదితరులు ఇతర భూమికలను పోషించారు.

డైరెక్టర్‌గా మారనున్న కంప్లీట్ యాక్టర్
కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్న మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్… తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. నాలుగు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సూపర్ స్టార్… త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్టు తన బ్లాగ్ ద్వారా ప్రకటించాడు. పోర్చుగీస్ నేపథ్యంలో సాగే బరోజ్ అనే పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నట్లు ఆయన తెలిపాడు.