
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 38


మోహన్ బాబుకి జోడీగా ఐశ్వర్యా రాయ్?

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఘాటు రిప్లై

విడుదల కానున్న లక్ష్మీస్ NTR మూవీ

తాప్సీ గేమ్ ఓవర్ మూవీ రిలీజ్ త్వరలో

అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం

ఇబ్బంది లో తమిళ మూవీ వర్మ (అర్జున్ రెడ్డి )

సీత మూవీ మౌత్ టాక్

NGK మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

రజినీ సినిమాలో విలన్‌గా మరో బాలీవుడ్ నటుడు?

బంపర్ ఆఫర్ పట్టేసిన ‘ఎఫ్ 2’ భామ?

బిజీ బిజీగా ‘ఛలో’ భామ

తెలుగు దేశం పార్టీ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

సిక్స్ ప్యాక్ అబ్స్ తో హీరో సుధీర్ బాబు

మరో ఎంటర్టైనర్లో వెంకీ?

విజయ్ దేవరకొండతో హను రాఘవపూడి చిత్రం?
వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ హీరో కాల్షీట్స్ కోసం… పలువురు దర్శకులు కథలతో సిద్ధంగా ఉన్నారు. వారిలో… హను రాఘవపూడి ఒకరు.

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్?
ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెట్టే యువ కథానాయకులలో శర్వానంద్ ఒకరు. ఆ మధ్య టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో సినిమా చేస్తూనే… తమిళ రీమేక్ చిత్రం ‘96’ను పట్టాలెక్కించాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇక తాజాగా సుధీర్ వర్మ కాంబినేషన్ మూవీని పూర్తి చేసిన శర్వా… ఇప్పుడు ‘96’ షూటింగ్లో పాల్గొంటూనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నాడట.

మోహన్ బాబుకి జోడీగా ఐశ్వర్యా రాయ్?
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఇద్దరు’(1997) సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది అందాల తార ఐశ్వర్యా రాయ్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ‘గురు’, ‘రావణ్’ (తెలుగులో విలన్) చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ విషయాన్ని ఐశ్వర్యా రాయ్ స్వయంగా ధ్రువీకరించింది.

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఘాటు రిప్లై
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ సోషల్ మీడియా లో తనపై ట్రోల్స్ చేసిన వారికి ఘాటు రిప్లై ఇచ్చారు. భాగమతి, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఉన్ని ముకుందన్ పరిచయమే. నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధాన మంత్రి కానుందున ఉన్ని ముకుందన్ అభినందనలు తెలిపారు.

విడుదల కానున్న లక్ష్మీస్ NTR మూవీ
GV ఫిల్మ్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో బయోగ్రాఫికల్ డ్రామా లక్ష్మీస్ NTR మూవీ రూపొందిందింది. NTR గా రంగస్థల నటుడు విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి గా యఙ్ఞశెట్టి, చంద్ర బాబు నాయుడు గా శ్రీతేజ్ నటించారు. NTR జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు నేపథ్యం లో లక్ష్మీస్ NTR మూవీ రుపొందింది. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

నటీనటుల అభినయమే హైలైట్ గా అలరించిన సీత
మొత్తం మీద చూసుకుంటే రెండేళ్ల గ్యాప్ తరువాత తేజ నుండి వచ్చిన 'సీత' రెండున్నర గంటల ఎంటర్టైన్మెంట్ కు డోకా లేని డిఫరెంట్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పవచ్చు.

తాప్సీ గేమ్ ఓవర్ మూవీ రిలీజ్ త్వరలో
ఝుమ్మంది నాదం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన తాప్సీ పన్ను, కోలీవుడ్ లో ఆడుకాలం మూవీ తో, బాలీవుడ్ లో చష్మే బద్దూర్ మూవీ తో పరిచయమయ్యారు. పింక్ హిందీ మూవీకి రైజింగ్ స్టార్ గా గోల్డెన్ రోజ్ అవార్డ్ అందుకున్నారు. తాప్సీ హిందీ లో నటించిన నామ్ షబానా, జు డ్వా 2 , సూర్మా, ముల్క్, బధ్లా మూవీస్ ఘనవిజయం సాధించాయి.

అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం
కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చైల్డ్ యాక్టర్ గా నటించిన సిసింద్రీ మూవీ కి బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. VV వినాయక్ దర్శకత్వం లో అఖిల్ మూవీ ద్వారా హీరో గా టాలీవుడ్ కు పరిచమయ్యారు. అఖిల్ నటించిన అఖిల్, హలో, Mr మజ్ను మూవీస్ పరాజయంపాలయ్యాయి. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నటించే అవకాశం కలిగింది .

ఇబ్బంది లో తమిళ మూవీ వర్మ (అర్జున్ రెడ్డి )
సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీ హిందీ, తమిళ భాషలలో రీమేక్ అయింది. సందీప్ వంగ దర్శకత్వం లో షాహిద్ కపూర్ హీరో గా హిందీ లో రూపొందిన కబీర్ సింగ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బాల దర్శకత్వం లో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా వర్మ పేరుతో తమిళం లో రూపొందింది. ఫైనల్ అవుట్ ఫుట్ సంతృప్తికరంగా లేకపోవడం తో నిర్మాణ సంస్థ వర్మ మూవీ ని రీషూట్ చేయాలని నిర్ణయించింది.

సీత మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

NGK మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ రాఘవ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా NGK (నంద గోపాల కుమరన్) తమిళ భాష లో రూపొందింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ NGK (నంద గోపాల కృష్ణ ) మే 31 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ మూవీని నిర్మాత KKరాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు.

రజినీ సినిమాలో విలన్‌గా మరో బాలీవుడ్ నటుడు?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు కేవలం దక్షిణాది ప్రేక్షకులనే కాకుండా… నార్త్ ఆడియన్స్‌నూ అలరిస్తూ ఉంటాయి. అందుకే ఈ మధ్య ఆయన నటించిన సినిమాల్లో బాలీవుడ్ నటులకూ అవకాశం కల్పిస్తున్నారు. రజినీ నటించిన గత మూడు చిత్రాల(‘కాలా’లో నానా పాటేకర్, ‘2.ఓ’లో అక్షయ్ కుమార్, ‘పేట’లో నవాజుద్దిన్ సిద్దికి)ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు ఈ మూడు సినిమాలలో నటించిన బాలీవుడ్ నటులు ప్రతినాయక పాత్రల్లో కనిపించడం విశేషం. కాగా… ప్రస్తుతం రజినీ, పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కలయికలో రూపొందుతున్న ‘దర్బార్’లో కూడా విలన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుణ్ణి ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

‘వి’ కోసం స్నేహ ధర్మం పాటించనున్న నాని?
ఇటీవల విడుదలైన ‘జెర్సీ’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఇంటలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో నటించనున్నాడు ఈ నేచురల్ స్టార్. ఈ సినిమా నాని కెరీర్లో 25వ చిత్రం కావడంతో… నాని పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసాడంట దర్శకుడు ఇంద్రగంటి.

బంపర్ ఆఫర్ పట్టేసిన ‘ఎఫ్ 2’ భామ?
“హనీ ఈజ్ ద బెస్ట్” అంటూ ‘ఎఫ్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది పంజాబీ జాబిలి మెహరీన్. ప్రస్తుతం… యాక్షన్ హీరో గోపీచంద్, తమిళ డైరెక్టర్ తిరు కాంబినేషన్లో రూపొందుతున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్గా నటిస్తోంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. అలాగే… నాగశౌర్య హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే… మెహరీన్ ఓ బంపర్ ఆఫర్‌ను తన ఖాతాలో వేసుకున్నట్టు టాలీవుడ్ టాక్.

బిజీ బిజీగా ‘ఛలో’ భామ
రష్మిక మందన్న… ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్లో తొలి అడుగులు వేసిన కన్నడ బ్యూటీ. తొలి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్న ఈ భామ… తన సెకండ్ తెలుగు ఫిల్మ్ ‘గీత గోవిందం’తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అనతికాలంలోనే దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక… ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

అన్నపూర్ణ స్టూడియోలో ప్రభాస్ ఆటా పాటా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వల్ మూవీకి సంబంధించి… చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

కోలీవుడ్ లో ఎంట్రీ కి రెడీ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన సీత మూవీ ఈ రోజు రిలీజయింది. అల్లుడు శీను,స్పీడున్నోడు , జయ జానకి నాయిక, సాక్ష్యం, కవచం వంటి మూవీస్ లో మాస్ హీరో గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మాస్ అవతార్ ను పక్కకు పెట్టి సీత మూవీ లో నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ లో నటించారు.

తెలుగు దేశం పార్టీ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్
వివాదాస్పద ట్వీట్స్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు దేశం పార్టీ పై ట్వీట్ చేశారు. తెలుగు దేశం పార్టీ 1982 సంవత్సరం మార్చి నెల 29 వ తేదీ ఆరంభమయిందని , 2019 సంవత్సరం మే నెల 23 వ తేదీ అంతమయిందని , అంతమవడానికి కారణం అబద్ధాలు, వెన్నుపోటు, లంచగొండితనం , అసమర్ధత, నారా లోకేష్ , YS జగన్ అని ట్వీట్ చేశారు.

సిక్స్ ప్యాక్ అబ్స్ తో హీరో సుధీర్ బాబు
సూపర్ హిట్ మూవీ ఏ మాయ చేసావె తో నటుడు గా టాలీవుడ్ కు పరిచయమైన సుధీర్ బాబు, శివ మనసులో శృతి మూవీ ద్వారా హీరోగా మారారు. ప్రేమకథాచిత్రమ్ మూవీ తో విజయం సాధించారు. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీ స్టారర్ V మూవీ రూపొందనుంది. ఆ మూవీ లో నాని తో కలసి సుధీర్ బాబు నటిస్తున్నారు. పుల్లెల గోపిచంద్ బయోపిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరో ఎంటర్టైనర్లో వెంకీ?
ఎఫ్ 2తో కామెడీ టైమింగ్‌లో తనకు తిరుగులేదని మరోసారి వెండితెర సాక్షిగా చాటాడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం తను నటిస్తున్న మరో మల్టీస్టారర్ మూవీ వెంకీమామలో కూడా హ్యూమర్ టచ్ ఉన్న పాత్రనే చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు.. ఈ సినిమా తరువాత చేయనున్న కొత్త చిత్రంలోనూ కామెడీకే పెద్ద పీట వేస్తున్నాడట ఈ సీనియర్ హీరో.