
ట్యాగ్ · 10 కథనాలు


"18 పేజెస్ " మూవీ రిలీజ్ డేట్

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ

రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
న్యూ క్యారెక్టర్ లో నిఖిల్
నిఖిల్ '18 పేజెస్' షూటింగ్ మొదలు

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం

18 పేజెస్ 3 డేస్ కలెక్షన్స్
మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అటు యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ2 సినిమా ఈమధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఇక్కడ హిట్ అవ్వడంతో నార్త్ లో కూడా రిలీజ్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అదే జోష్ తో ఇప్పుడు 18 పేజెస్ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కూడా నిఖిల్, అనుపమ పరమేశ్వర్ లే హీరో హీరోయిన్లు. ఈసినిమా కూడా ఈ నెల 23వ తేదీన రిలీజ్ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది…

18 పేజెస్ మూవీ రివ్యూ- క్రేజీ లవ్ స్టోరీ
ఓవరాల్ గా చెప్పాలంటే 18 పేజెస్ సినిమా ఓ విభిన్నమైన లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. భావోద్వేగ భరితంగా సాగే ఫీల్ గుడ్ డిఫరెంట్, క్రేజీ లవ్ స్టోరీగా నిలుస్తుంది 18 పేజెస్.

"18 పేజెస్ " మూవీ రిలీజ్ డేట్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పెండింగ్ పూర్తి చేసే పనిలో '18 పేజెస్'
యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇంతకుముందెన్నడూ చేయని విధంగా ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందులో 18 పేజెస్ సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల లేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి మరో పది రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీంతో తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చివరి దశ షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పదిరోజుల…

"18 పేజెస్ "మూవీ డబ్బింగ్ షురూ
యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 1న చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమాల షూటింగ్ లను కూడా వాయిదా వేసుకుంటున్నారు పలువురు హీరోలు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ లాంటి వాళ్లు సెల్ప్ ఐసోలేషన్ కు వెళ్లారు. ఇక తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా తన సినిమాల షూటింగ్ లను వాయిదా వేసుకున్నాడు.

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నిఖిల్ వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2" , "18 పేజెస్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి .
న్యూ క్యారెక్టర్ లో నిఖిల్
"హ్యాపీ డేస్ " మూవీ లో ఇంజనీరింగ్ స్టూడెంట్ , "యువత "మూవీ లో విలేజ్ యువకుడు , "స్వామి రారా "మూవీ లో పిక్ పాకెటర్ , "కార్తికేయ "మూవీ లో మెడికల్ స్టూడెంట్ ; "ఎక్కడికి పోతావు చిన్నవాడా "మూవీ లో ప్రేమికుడు , "అర్జున్ సురవరం "మూవీ లో డేరింగ్ జర్నలిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ ", "కార్తికేయ 2 " మూవీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిఖిల్ '18 పేజెస్' షూటింగ్ మొదలు
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజెస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చిలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కరోనా వలన షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే మళ్లీ ఇన్ని నెలలు తర్వాత షూట్ ను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ 2 సంస్థ తాజాగా లొకేషన్ లో పిక్ ను పోస్ట్ చేస్తూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.

అనుపమకు "18 పేజెస్ " స్వాగతం
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కుమారి21 F " మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ రూపొందుతుంది. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఎంపిక అయ్యారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.