గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానుంది. ఇక ప్రవీణ్ సత్తారు ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు తీయడంలో ఎక్స్ పర్ట్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే కంప్లీట్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ చివరిదశకు కూడా చేరుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ బుడాఫెస్ట్‌లో జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను ఆగష్ట్ 25వ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
The envoy of peace coming to create chaos💥
Witness ARJUN in all-blazing Action on Big Screens❤️🔥#GandeevadhariArjuna Release in Theatres WW on Aug 25th
Mega Prince @IAmVarunTej @sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @jungleemusicSTH#GDAonAug25th pic.twitter.com/ZJzSEqXjDc
— SVCC (@SVCCofficial) June 7, 2023
కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























