న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా తో మంచి స్టార్టప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. నాని ప్రధాన పాత్రలో శౌర్యవ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నాని 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ముందు గోవాలో ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఆతరువాత ముంబై షెడ్యూల్ ను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే మృణాల్ తన ముంబై షెడ్యూల్ ను పూర్తిచేసుకున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పోస్ట్ చేస్తూ తెలిపింది. ఇక ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ కూడా దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. గోవా తరువాత ముంబై షెడ్యూల్ కూడా పూర్తయిందని.. మీతో త్వరలో ఓ మ్యాజిక్‌ను షేర్ చేసుకునేందుకు వెయిట్ చేయలేకపోతున్నాం ట్వీట్ చేసింది. కూనూర్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్టు కూడా పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక చిన్న వీడియోను రిలీజ్ చేయగా అందులో ముంబై తీర ప్రాంతంలో నాని నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
After Goa, with even more love and passion, #Nani30 wraps up an exciting schedule in Mumbai ❤️. We can’t wait to share the magic with you soon!! 🤗
Natural🌟 @NameisNani @mrunal0801 @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @TSeries pic.twitter.com/KJ7bO8MYeH
— Vyra Entertainments (@VyraEnts) June 1, 2023
ఇక ఈసినిమాలో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































