రజనీ కాంత్ తనయ ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలాం. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో తలైవా రజనీకాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా నుండి రజనీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో రజనీ మొయిదీన్ భాయ్ గా నటించనున్నాడు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాలో మరో లెజెంట్ కూడా నటిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్. ఈసినిమాలో ఆయన కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలిపాారు. తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టిన కపిల్ తో రజనీకాంత్ మాట్లాడుతున్న ఫోటోని రజిని షేర్ చేస్తూ ఇండియాకి ఫస్ట్ వరల్డ్ కప్ తీసుకు వచ్చిన లెజెండరీ కపిల్ దేవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
It is my honour and privilege working with the Legendary, most respected and wonderful human being Kapildevji., who made India proud winning for the first time ever..Cricket World Cup!!!#lalsalaam#therealkapildev pic.twitter.com/OUvUtQXjoQ
— Rajinikanth (@rajinikanth) May 18, 2023
ఇంకా ఈసినిమాలో జీవిత రాజశేఖర్, రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. చాలా కాలం తరువాత జీవిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























