వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమాలో హీరో విలన్ ను చంపుతాడు కానీ ఈసినిమాలో హీరో విలన్ చావకుండా, అతడిని కాపాడాలని హీరో అనుకోవడమే సినిమా థీమ్. డిఫరెంట్ థీమ్ వస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి విలన్ ను హీరో ఎందుకు కాపాడుతున్నాడు? కాపాడటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి అయితే చిత్రయూనిట్ పలు ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా జీరో కట్స్ తో యూఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. సెన్సార్ బృందం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నాగచైతన్య ఇంటెన్స్ యాక్టింగ్, వెంట్ ప్రభు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందట.

కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























