డైరెక్టర్ శంకర్ మాత్రం బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నాయి. ప్రస్తుతం తను కమల్ తో ఇండియన్ 2 అలానే రామ్ చరణ్ తో ఆర్సీ 15 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈరెండు సినిమాల షూటింగ్ లను పార్లల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు తానే ఈరెండు సినిమాల షూటింగ్ లకు సంబంధించి అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఆమధ్య ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ ను పూర్తి చేసి గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ షూట్ కు వెళుతున్నట్టు అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా గేమ్ ఛేంజర్ షూట్ కు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు శంకర్. తన ట్విట్టర్ ద్వారా గేమ్ ఛేంజర్ ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్ షూట్ మొత్తం పూర్తి అయిందని, మళ్లీ తాను కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ షూట్ కి షిఫ్ట్ అవుతున్నట్లు తెలిపాడు శంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wrapped up #GameChanger ‘s electrifying climax today! Focus shift to #Indian2 ‘s silver bullet sequence from tomorrow! pic.twitter.com/HDUShMzNet
— Shankar Shanmugham (@shankarshanmugh) May 9, 2023
ఇక ఇటీవలే ఈసినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోనుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































