అల్లరి నరేష్ ఉగ్రం రివ్యూ..ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్

allari naresh ugram movie review

అల్లరి నరేష్ హీరోగా, విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉగ్రం. నాంది సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ముందు నుండీ అంచనాలు పరిగాయి. మరోవైపు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయాలు తెలియాలంటే ఈసినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. అల్లరి నరేష్, మిర్నా, ఇంద్రజ తదితరులు..
డైరెక్టర్.. విజయ్ కనకమేడల
బ్యానర్స్.. షైన్ స్క్రీన్ బ్యానర్
నిర్మాతలు..సాహు గారపాటి,హరీష్ పెద్ది
సంగీతం..శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫి..సిద్

కథ
శివ కుమార్ (అల్లరి నరేష్) సీఐ గా పనిచేస్తుంటాడు. హీరోయిన్ మిర్న మీనన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఒక పాప పుడుతుంది. మరోవైపు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా దందాలో ఆడపిల్లలు, మహిళలు వరుసగా కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈక్రమంలో అల్లరి నరేష్ కుటుంబానికి యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో నరేష్ మెమరీ కూడా పోతుంది. అయితే ఆ యాక్సిడెంట్ తరువాత నరేష్ వైఫ్, పాప కూడా కనిపించకుండా పోతారు. మరి వారికి ఎమైంది.. హ్యూమన్ ట్రాఫికింగ్ కి వారు కనిపించకుండా పోవడానికి కారణం ఏదైనా ఉందా? ఆ మాఫియాను ఎలా అరికట్టాడు అనేది ఈసినిమాకథ..

పెర్ఫామెన్స్..

ఈవీవీ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నరేష్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుతెచ్చుకొని ఆ తరువాత నుండి కామెడీ సినిమాలతోనే కితకితలు పెట్టించాడు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారడంతో తన సినిమాలు కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు పాత్రలు ఎంచుకోవడం మొదలుపెట్టాడు. అలా నాంది సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. ఆ సినిమా నుండి డిఫరెంట్ కథలు ఎంచుకోవడం మొదలుపెట్టాడు. అలా వచ్చిందే ఉగ్రం సినిమా.

ఈసినిమాలో కూడా మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు నరేష్. పవర్ ఫుల్ ఆఫీసర్ గా పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నిజం చెప్పాలంటే నరేష్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నరేష్ పర్ఫామెన్స్ , అలాగే అయన చూపించిన వేరియేషన్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. మరోసారి తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర చేశాడు అల్లరి నరేష్. ముఖ్యంగా ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం అదరగొట్టాడని చెప్పొచ్చు.

ఇక నరేష్ భార్య పాత్రలో నటించిన మిర్నా తన పాత్రకు న్యాయం చేసింది. డీసెంట్ గా తన నటనతో ఆకట్టుకుంది. అలాగే డాక్టర్ పాత్రలో ఇంద్రజ సైతం తన మార్క్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

ఇక నాంది తరువాత విజయ్ మరో ఇంట్రెస్టింగ్ కథతో వచ్చాడని చెప్పొచ్చు. విజయ్ రాసుకున్న కథ బాగుంది. మిస్సింగ్ థ్రిల్లర్ కాబట్టి ట్విస్ట్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మిస్సింగ్ లకి సంబందించిన విషయాలని చూపించిన విధానం మెప్పిస్తుంది. మిస్సింగ్స్ వెనకాల ఉన్న పెద్ద తలకాలను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు.. మిస్టరీని సాల్వ్ చేసే విధానం, కథలో వచ్చే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ తీరు థ్రిల్లింగ్ గా ఉంటాయి. మొత్తానికి మరో థ్రిలింగ్ కథతో ప్రేక్షకులకు థ్రిల్ ను ఇవ్వడంతో సక్సెస్ అయ్యాడు. ఇద్దరూ మరో హట్ కొట్టేసినట్టే అనిపిస్తుంది.

టెక్నికల్ వాల్యూస్

ఈసినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలానే సినిమాటోగ్రఫి కూడా ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్..ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కు తగ్గట్టుగా అందించిన బీజీయం ఆకట్టుకుంటుది. సిద్ అందించిన సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మరోసారి ఈసినిమాతో తెలియచేశారు. ఇక థ్రిల్లర్ మూవీస్ సినిమాలు చూసే వాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చేస్తుంది. అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయచ్చు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.