షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఉగ్రం

allari naresh ugram movie shoot completed

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇది వరకే నరేష్, విజయ్ కాంబినేషన్ లో నాంది అనే వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకుల నుండి … విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను కూడా అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా కూడా వీరి కాంబినేషన్ లో వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఇంకా పోస్టర్లను చూస్తుంటే ఈసినిమా పూర్తిగా వైల్డ్ యాక్షన్ డ్రామాగా ఉండ‌నున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ దశలోనే ఉంది. ఇక ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ముందు ఏప్రిల్ 14న రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. మే5వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.