సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్ది తప్పుడు వార్తలు కూడా చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సెలబ్రిటీపై రూమర్స్ ఎక్కువైపోయాయి. అయితే ఈమధ్య సెలబ్రిటీలు చనిపోయారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి న్యూస్ పై సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా కోట శ్రీనివాసరావుపై కూడా అలాంటి రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇక ఈవార్తలపై కోట శ్రీనివాసరావు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, బాగానే ఉన్నానని వీడియో విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీడియోలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నేను పోయానని సోషల్ మీడియాలో ఎవరో వార్తలు రాశారట.. ఇలాంటి వార్తలు ఎందుకు వేస్తారో తెలియదు. తెల్లారితే పండుగ. ఏంట్రా.. ఏంటిదని ఆలోచన. ఆ వార్తలు విని పొద్దున నుండి ఎంతో మంది ఫోన్లు చేశారు.. ఇప్పటికే 50 కాల్స్ వరకూ మాట్లాడా.. మా వాళ్లు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు.. పోలీసు వాళ్లు కూడా వచ్చారు.. వాళ్లు నన్ను చూసి షాకయ్యారు.. ఇలాంటి తప్పుడు వార్తల వల్ల కాస్త పెద్దవాళ్లుంటే గుండె ఆగి చచ్చిపోతారని.. వాటిని అరికట్టమని వారికి చెప్పాను.. మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు అంటూ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: