కీర్తి ముందు కథ కూడా వినలేదు

Natural Star Nani Shared Interesting Incident With Keerthy Suresh

న్యాచురల్ స్టార్ నాని తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన నటన సహజంగా ఉంటుంది కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. ఇక ఈమధ్య నాని కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఈనేపథ్యంలోనే నాని దసరా సినిమాతో కెరీర్ లో మొదటి సారి కొత్త మేకోవర్ తో ముందుకు వస్తున్నాడు. తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో ఫుల్ మాస్ రోల్ తో రాబోతున్నాడు. ఇక ఈసినిమా మార్చి30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నాని కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. ఇక ఇంటర్వ్యూల్లో నాని ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు. దీనిలో భాగంగానే నాని ముంబై వెళ్లి అక్కడ ప్రమోషన్ లో ఈసినిమా గురించి పలు విషయాలు తెలియచేశారు. ఇప్పుడు తాజాగా చెన్నై ఇంటర్వ్యూల్లో పాల్గొన్న నాని కీర్తి సురేష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేశారు. ఈసినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా కోల్ మైన్ బ్యాక్ గ్రౌండ్ నుండే వచ్చాడు.. ఆయన తండ్రి డంపర్ లో 40 ఏళ్లు పనిచేశారు.. తను నాకు కథ చెబుతున్నప్పుడు తను నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు.. తన కథలో ఉన్న నిజాయితీ, కమిట్ మెంట్ మాత్రమే కనిపించింది.. ఇక కీర్తికి శ్రీకాంత్ కథ చెప్పడానికి వెళ్లినప్పుడు తన తెలంగాణ యాస వల్ల కథ అర్థం కాలేదు.. తరువాత కథ కూడా వినలేదు.. అయితే ఆ తరువాత నేనే మరో నెరేటర్ ను పెట్టి కథ వినిపించాను. ఆ తరువాత కథ విని తను చాలా హ్యాపీగా ఫీలయింది.. అంతేకాకుండా ఒక మంచి కథను మిస్ అయి ఉండేదాన్ని అంటూ తెలిపింది.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.