వన్మయే క్రియేషన్స్ , విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ధమ్కీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రావు రమేష్ , అజయ్ , రోహిణి , అక్షర గౌడ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధమ్కీ మూవీ మార్చి 22న రిలీజ్ కానుందని సమాచారం. గత నెలలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యిందనీ , మార్చి 22న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. విశ్వక్ సేన్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























