టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. తన మేకోవర్ పూర్తిగా మార్చేసి డార్క్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాతో సందీప్ కిషన్ బాగానే ఆకట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వారు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా ఆహా లో రిలీజ్ అయిపోయింది. ప్రస్తుతం ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈసినిమాను థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయొచ్చు.
కాగా ఈసినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈసినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో కరణ్ సీ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈసినిమాను భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. సంగీతం సామ్ సిఎస్, సినిమాటోగ్రఫి కిరణ్ కౌశిక్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























