కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి అబ్బాయి గా ఇమేజ్ తెచ్చుకున్న కిరణ్ కు అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. చిన్నసినిమాలే కాదు.. పెద్ద పెద్ద బ్యానర్స్ నుండి సైతం కిరణ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజా సమాచారం ప్రకారం.. ట్రైలర్ ని ఫిబ్రవరి 6న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ గా మేకర్స్ నుండి ప్రకటన రానుందట.
కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియల్ అందిస్తున్నాడు. ఈసినిమాను వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























