శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మహానటి తర్వాత విజయ్‌దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్నసినిమా ఇది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. అందులోనూ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈనేపథ్యంలో మధ్యలో పలు రూమర్స్ కూడా తెరపైకి వచ్చాయి. ఈసినిమాలో సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను మేకర్స్ ఖండించారనుకోండి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ గురించి తాజాగా అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఈసినిమా షూటింగ్ త్వరలో మళ్లీ మొదలుపెట్టనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#khushi regular shoot will start very soon 👍
everything is going to be beautiful❤️— Shiva Nirvana (@ShivaNirvana) January 30, 2023
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































