మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఒకపక్క సినిమా షూటింగ్ ముగింపు దశకు వస్తున్నా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. మరోవైపు ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తారేమో అని గత ఏడాది నుండి వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయలేదు. అయితే తాజా సమాచారం ఈసినిమా నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ ను మార్చి 27న చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































