వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా వారిసు. విజయ్ తెలుగు డైరెక్టర్ తో చేయడం అలానే వంశీ తమిళ్ లో సినిమా చేసిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగింది. ముందు తమిళ్ లో రిలీజ్ అయిన ఈసినిమాకు అక్కడ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరికీ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక కలెక్షన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా కేవలం ఐదు రోజుల్లోనే 150 కోట్లకు పైగా ఫస్ట్ వీక్ అయిపోయే సరికి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా తెలుగులో వారుసుడు టైటిల్ తో సాధించింది. ఇక్కడ కూడా ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తన తొలి తమిళ్ సినిమా సక్సెస్ సాధించినందుకు వంశీ పైడిపల్లి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈసందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. వారసుడు చిత్రం రిజల్ట్ పట్ల సంతోషం గా ఉన్నానని తెలిపారు. నిర్మాత దిల్ రాజు సినిమాకి వచ్చిన రిజల్ట్ పట్ల సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రం దిల్ రాజు కి రెస్పెక్ట్ తో పాటుగా, చాలా డబ్బు ను తీసుకు వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. వంశీ పైడిపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించరు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























