ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ రీమేకా?

Interesting Update About Pawan Kalyan's Ustaad Bhagat Singh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ustaad Bhagat Singh,Ustaad Bhagat Singh Movie,Ustaad Bhagat Singh Telugu Movie,Ustaad Bhagat Singh Update,Ustaad Bhagat Singh Updates,Ustaad Bhagat Singh Movie Updates,Ustaad Bhagat Singh Movie Update,Ustaad Bhagat Singh Movie Latest Updates,Ustaad Bhagat Singh Movie Latest Update,Ustaad Bhagat Singh Latest Update,Ustaad Bhagat Singh Latest Updates,Ustaad Bhagat Singh Telugu Movie Latest Updates,Ustaad Bhagat Singh Movie News,Ustaad Bhagat Singh Telugu Movie Latest News,Ustaad Bhagat Singh Movie Latest News,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan New Movie Updates,Pawan Kalyan Latest Movie Updates,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Movie News,Pawan Kalyan New Projects,Pawan Kalyan Latest Projects,Pawan Kalyan Upcoming Projects,Pawan Kalyan Next Projects,Pawan Kalyan Latest News,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Ustaad Bhagat Singh,Pawan Kalyan Ustaad Bhagat Singh Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇదివ‌ర‌కెన్నడూ క‌నిపించ‌ని పాత్రలో సంద‌డి చేయ‌బోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుద‌లైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ స్నేహితుడు ఆనంద్ సాయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈసినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా రీమేక్‌ అని చెప్పాడు. అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ టీం ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో పవన్‌ కల్యాణ్ లుక్స్ మార్చే పనిలో ఉన్నారని ఆనంద్ సాయి చెప్పారు.

గతంలో హరీష్ శంకర్ పవన్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇది హిందీ దబాంగ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. అయితే ఒరిజినల్ ను దించేయకుండా ఆసినిమాకు చాలా మార్పులు చేశాడు. రీమేక్‌ వెర్షన్‌లో పవన్ కల్యాణ్‌ మ్యానరిజం, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా చాలా మార్పులు చేశాడు. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ తమిళ సినిమా తేరి రీమేక్‌ అని వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. మరి ఇదే రీమేక్ చేస్తున్నారమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + eleven =