వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ కానుంది. తెలుగు డైరెక్టర్, తమిళ్ హీరో కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి4 వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు వారిసు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#VaaThalaivaa it’s time for #VarisuTrailer 🔥
Releasing Tomorrow at 5 PM on @SunTV YouTube channel 💥See ‘U’ soon nanba 😁#VarisuGetsCleanU#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @iamRashmika @7screenstudio @TSeries #Varisu #VarisuPongal pic.twitter.com/OAm0gBhV48
— Sri Venkateswara Creations (@SVC_official) January 3, 2023
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































