డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి బెస్ట్ పిక్చర్ అలానే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి నుండి ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు ప్రశంసలు లభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు టీమ్ కు అభినందనలు తెలుపుతూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. హీరో రామ్ చరణ్, ప్రియాంక జంటగా బాలీవుడ్ మూవీ జంజీర్ లో నటించిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































