టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తుందని చెప్పొచ్చు. కొత్త కొత్త కథలతో హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అందులో శైలేష్ కొలను కూడా ఉన్నాడు. రీసెంట్ గానే హిట్ 2 తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇంతకుముందు తన నుండి వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందించిన ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సీక్వెల్ గా హిట్ 2 ను తెరకెక్కించి ఇటీవల రిలీజ్ చేశారు. అడివి శేష్ నటించిన ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అప్పుడే ఈసినిమాకు ఏడు ప్రాంచైజీస్ ఉన్నట్టు తెలిపాడు డైరెక్టర్. ఇక చెప్పినట్టే హిట్ 3 సినిమా కోసం అప్పుడే రెడీ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హిట్ 3 సినిమాలో న్యాచురల్ స్టార్ నాని కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల గురించి చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. అయితే తాజాగా ఈసినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఓ అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కావాలని 10 రోజుల నుండి ఈ పిక్చర్ కనిపిస్తుంది…కలలో కూడా ఇదే వినిపిస్తుంది అంటూ వెంకీ చిత్రం నుంచి ఓ ఫన్నీ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
For the last 10 days I have seen this picture so much, kalalo vinipisthundi naaku Anirudheeeyy kavali ani !! #hit3 #arjunsarkaar pic.twitter.com/XuDjy18aTL
— Sailesh Kolanu (@KolanuSailesh) December 13, 2022
కాగా హిట్ 2 సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించనుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























