హీరోల పుట్టినరోజులకు వారి సినిమాలను రీరిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాలను రీరిలీజ్ చేసి మళ్లీ కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు తలైవా రజినీకాంత్ బాబా సినిమా కూడా రీరిలీజ్ కు సిద్దమవుతుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ బర్త్ డే కావడం అలానే ఈసినిమా రిలీజ్ అయి సుమారు 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా మరోమారు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మేకర్స్. ఇప్పటికే పలు కొత్త సీన్లకు కూడా యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా ముగిశాయి. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా ఈసినిమాను ముందు డిసెంబర్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు ఒక రోజు ప్రీ పోన్ చేశారు. డిసెంబర్ 10 వ తేదీనే ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























