అనిల్ రావిపూడి-బాలకృష్ణ మూవీ గ్రాండ్ లాంచ్

Balakrishna And Anil Ravipudi Movie Launched Today, Nandamuri Balakrishna’s Film With Anil Ravipudi, Nandamuri Balakrishna, Balakrishna, Anil Ravipudi, Balakrishna Latest Movie, Balakrishna Upcoming Movie, Balakrishna Movies, NBK108, NBK108 2023, NBK108 Movie, NBK108 Telugu Movie, NBK108 Update, NBK108 News, NBK108 Latest News, NBK108 New Update, NBK108 Movie Live Updates, NBK108 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ అనిల్ రావిపూడి కాస్త కామెడీ కథలతో అలరించగా.. ఇప్పుడు బాలకృష్ణ కోసం మాత్రం ఓ పవర్ ఫుల్ కథనే సిద్దం చేసినట్టే తెలుస్తుంది. ఆయన మేనరిజమ్స్ కు తగ్గట్టుగా యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశారంట. గతంలో ఎప్పుడూ చూడని విధంగా తెరపై బాలయ్యను చూపించబోతున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాను నేడు గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులే పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ను కొట్టారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, కిలారు సతీష్, నిర్మాత శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. రెగ్యూలర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే ప్రారంభం అవుతుంది.

కాగా ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ప్రియాంక్ జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.