టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో హరీ, హరీష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా యశోద. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సరోగసిలో జరిగే క్రైమ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. ఇక ఈసినిమా నవంబర్ 11వ తేదీన రిలీజ్ అయి విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. కొత్త కథాంశంతో తెరకెక్కిన ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ లో కూడా రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కలను ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమాను డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
unravel this oh-so-mysterious trap with yashoda 👀#YashodaOnPrime, Dec 9#yashoda #yashodamovie @Samanthaprabhu2 pic.twitter.com/dDDzKsOF4W
— prime video IN (@PrimeVideoIN) December 6, 2022
కాగా ఈసినిమాలో ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజు, మురళీ శర్మ, రావు రమేష్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని ప్రముఖ సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా సీక్వెలన్ పై కూడా దర్శకులు సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. సీక్వెల్ కాదు సీక్వెల్స్ ఉంటాయని.. సమంత కనుక ఒప్పుకుంటే రెడీగా ఉన్నట్టు చెప్పారు. మరి చూద్దాం.. సమంత ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























