పవన్ కళ్యాణ్ ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?

For Which pawan kalyan upcoming movie you are eagerly waiting

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతోనూ అలానే మరోపక్క రాజకీయాలతోనూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రీఎంట్రీ తరువాత వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. దీంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఎప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాలు ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాహో డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమాను నిన్ననే అధికారికంగా ప్రకటించారు. డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై ఈసినిమాను నిర్మించనున్నారు. సాహో డైరెక్టర్ కాబట్టి ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈసినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతారో తెలీదు.

మరి ఈ మూడు సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మీ ఓటు తెలపండి.

[totalpoll id=”91504″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.