ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వచ్చిన సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత విష్ణు ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హార్రర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన ఈసినిమా ఈఏడాది అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటించారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్ వ్యవహరించగా.. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందించారు ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: