వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో దేశం లోనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K మూవీపై తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసారు. ఈ సినిమా వరల్డ్ – సెటప్ – మేకింగ్ – ప్రాపర్టీస్.. ప్రతిదీ పూర్తిగా కొత్తగా ఉంటుందనీ ,ప్రాజెక్ట్ K అనేది చాలా కొత్త సినిమా, స్క్రిప్ట్ కూడా కొత్తదనీ , బిల్డప్ చేసే వరల్డ్ – టెక్నికల్ గా అన్నీ కొత్తవే అనీ ,సినిమా కోసం అన్నీ కొత్తగా తయారు చేస్తున్నామనీ , ఈ సినిమాకు వెహికల్స్ కావాలంటే ఎక్కడా దొరకవనీ కార్లు తయారు చేసుకోవాలనీ చెప్పారు.ఈ సైన్స్-ఫిక్షన్ చిత్రానికి ఫ్యూచర్ ఆటోమొబైల్స్ ను అభివృద్ధి చేయడంలో సహాయం కావాలని మహీంద్రా గ్రూప్ ను నాగ్ అశ్విన్ కోరిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: