డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆర్ ఆర్ ఆర్ మూవీ 17 రోజులకు 185 మిలియన్ జపనీస్ యన్ లు సాధించింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10.34 కోట్లు . ఇక ఈ మూవీ జపాన్ లో 122కె ఫుట్ ఫాల్స్ ని సొంతం చేసుకుంది. జపాన్ లో ఇప్పటివరకూ విడుదలై భారీ కలెక్షన్స్ అందుకున్నసౌత్ సినిమాల్లో ముత్తు ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, బాహుబలి 2 సెకండ్ ప్లేస్ ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ ముచ్చటగా మూడవ ప్లేస్ ని సొంతం చేసుకోవడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































