మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు బాబి. ఇక ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాకు రవితేజ కూడా బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై భారీ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. దీనికోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్ ను స్కోర్ చేయగా, టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























