క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే అనసూయ, శివాత్మికలు, ప్రకాష్ రాజ్ తమ డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే బ్రహ్మానందం తన డబ్బింగ్ ను పూర్తిచేసుకున్నారు. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ కూడా తన డబ్బింగ్ ను పూర్చి చేసుకుంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ట్విట్టర్ ద్వారా చెబుతూ మా అమ్మోరు నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేసుకుంది అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
#Rangamarthanda …dub diaries ……..my ammoru … straight four hrs completed….♥️♥️♥️♥️ pic.twitter.com/QuBiuIAY8a
— Krishna Vamsi (@director_kv) October 28, 2022
కాగా ఈసినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: