ఆర్ఆర్ఆర్  విదేశీయులను ఆకట్టుకోవడానికి అదే కారణం

SS Rajamouli reveals why RRR was a huge hit in foreign countries, SS Rajamouli reveals Secret Of RRR, RRR was a huge hit in foreign countries, foreign countries, Secret Of RRR, Ajay Devgn, NT Rama Rao Jr, Ram Charan, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR New Update, RRR Latest Update, RRR Movie Updates, RRR Telugu Movie, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie New Update, RRR Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజుల పాత్రలతో ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక రాజమౌళి సినిమా అంటే మనకు ఎలాగూ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.. రాజమౌళి కూడా ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తుంటాడు. ఇక బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో మన సౌత్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా రాజమౌళి సినిమాకు అంత క్రేజ్ ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో మెట్టు ఎక్కి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. ఓవర్సీస్ లో కూడా ఈసినిమా ఎలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుందో చూస్తూనే ఉన్నాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా విదేశీయులను ఆకట్టుకోవడానికి కారణం ఏంటో చెబుతున్నాడు రాజమౌళి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. హీరోయిజం, భారీ యాక్షన్ సన్నివేశాల వల్లే ఈ చిత్రం అన్ని హద్దులూ చెరిపేసి ప్రపంచాన్ని మెప్పించిందని తెలిపాడు. భారత ప్రజలు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. భారతీయ ప్రేక్షకులు ఉన్న చోట సినిమాకు మంచి స్పందన వస్తుందని నేను భావించా. కానీ విదేశీయుల నుంచి ఇంత గొప్ప ఆదరణ రావడం ప్రారంభమైంది. ఇది నేను అస్సలు ఊహించలేదు’ అని అన్నారు. ఇక ఈసినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా రీసెంట్ గానే వచ్చింది.

కాగా ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =