రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు చిరు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. అందులో వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఒకటి. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇటీవల టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టైటిల్ టీజరే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఊరమాస్ లుక్‌లో చిరంజీవి కనిపించడంతో ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో మాస్ మాహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక పాట కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఫుల్ మాస్ సాంగ్ ఇద్దరి మధ్య చిత్రీకరించబోతున్నారట. ఈ పాటకు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్-చిరు కలిసి తార్ మార్ తక్కర్ మార్ అనే పాట రాగా ఆ పాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరి చిరు-రవితేజ పై మాస్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























