కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బింబిసార సీక్వెల్

Bimbisara movie Sequel update, Bimbisara 2 movie update, Bimbisara Sequel update, Kalyan Ram, Samyuktha Menon, Catherine Tresa, Vashist Mallidi, Kalyan Ram Latest Movie, Kalyan Ram's Upcoming Movie, Bimbisara, Bimbisara Movie, Bimbisara Update, Bimbi

ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బింబిసార సీక్వెల్

Bimbisara 2 Movie Update

Bimbisara movie Sequel update, Bimbisara 2 movie update, Bimbisara Sequel update, Kalyan Ram, Samyuktha Menon, Catherine Tresa, Vashist Mallidi, Kalyan Ram Latest Movie, Kalyan Ram's Upcoming Movie, Bimbisara, Bimbisara Movie, Bimbisara Update, Bimbi

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ఘనవిజయం సాధించి , భారీ వసూళ్ళు రాబట్టిన విషయం తెలిసిందే. బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.. బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.మొదటి వారం లో బింబిసార మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 64 కోట్లు కలెక్ట్ చేసిన బింబిసార మూవీ నిర్మాత‌ల‌కు డ‌బుల్ ఫ్రాఫిట్‌ను తెచ్చిపెట్టింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న బింబిసార మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. బింబిసార సినిమా ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు బింబిసార 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.దర్శకుడు మల్లిడి వశిష్ట ప్రస్తుతం బింబిసార 2 మూవీ స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు . ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. తాజాగా దర్శకుడు వశిష్ట ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... కళ్యాణ్ రామ్ కమిటైన ఇతర ప్రాజెక్ట్స్ పూర్తవడాన్ని బట్టి జూన్, జూలై నాటికి తమ సినిమా షూటింగ్ ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్టు , బింబిసార మూవీ భారీ హిట్ అయినందున తనపై విపరీతమైన ఒత్తిడి ఉందనీ , బింబిసార మూవీ కి బింబిసార2 మూవీ కి ఖచ్చితంగా సంబంధం కలిగి ఉంటుంది అనీ చెప్పారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్