క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. వీరమల్లు గా రాబిన్ హుడ్ లాంటి తరహా పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదులుపెట్టారు చిత్రయూనిట్.. కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోయింది. దాదాపు సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పటివరకూ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడుతూ వస్తుంది. పవన్ తనకు కుదిరినప్పుడల్లా ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈమధ్య మిగిలిన షూటింగ్ కు సంబంధించిన వర్క్ షాప్ ను కూడా నిర్వహించారు. దీనిలో భాగంగా పవన్ కూడా పలు రిహార్సల్స్ చేసిన ఫొటోలు కూడా విడుదల చేశారు. ఇక తాజా సమాచారం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇక ఈ షూటింగ్ లో పవన్ కూడా పాల్గొన్నట్టు సమాచారం. పవన్ పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట మేకర్స్. పవన్ తో పాటు పలువురు కీలక నటులు కూడా ఈషూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























