తమిళ్ స్టార్ హీరోలు, అన్నదమ్ములు అయిన సూర్య-కార్తి లకు తమిళ్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే మంచి ఫాలోయింగ్ ఉందన్న సగంతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారి సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈ ఏడాది విరుమన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించాడు కార్తి. ఇక ప్రస్తుతం కార్తి నుండి రాబోతున్న సినిమా సర్దార్. స్పై థ్రిల్లర్గా నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. అక్టోబర్ 21వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇక తెలుగులో కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా కార్తి సినిమా విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా డైరెక్ట్ చేసే ఆలోచన ఏదైనా ఉందా అన్న ప్రశ్న ఎదురవ్వగా.. డైరెక్ట్ చేసే అన్నయ్య సూర్య ను చేస్తానని.. ఎందుకంటే సూర్య తనను బాగా అర్ధం చేసుకుంటాడని, తప్పు చేస్తే అక్కడే చెప్తాడని.. నేను ఏదైనా విషయం పై కన్య్ఫూజన్లో ఉన్నా…క్షణాల్లో అర్థం చేసుకుంటాడని తెలిపాడు. అన్నయ్య తప్ప మరెవరూ నాకు కాల్షిట్లు కూడా ఇవ్వరని తెలిపాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని అయినప్పటి నుంచి అన్నయ్యకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్తో లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. రజీషా విజయన్, లైలా, యోగి సేతు, మునీష్కాంత్, మాస్టర్ రిత్విక్, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఈసినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అన్నపూర్ణ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























