ఖుషి కొత్త షెడ్యూల్ అప్ డేట్

vijay devarakonda and samantha kushi movie new schedule update, kushi movie new schedule update, vijay devarakonda and samantha kushi movie, samantha kushi movie, vijay devarakonda's kushi movie, Shiva Nirvana, vijay devarakonda, samantha, kushi, kushi Update, kushi Telugu movie, kushi New Update, kushi Telugu Movie New Update, kushi Movie, kushi Latest Update, kushi Movie Updates, kushi Telugu Movie Live Updates, kushi Telugu Movie Latest News, kushi Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడుతున్నాడు విజయ్. వాటిలో ఖుషి సినిమా కూడా ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ మూవీ తర్వాత సామ్, శివ నిర్వాణ కాంబోలో మూవీ కావడం, విజయ్ హీరో కావడంతో సినిమా పైన మంచి అంచనాలున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. మధ్యలో లైగర్ సినిమా ప్రమోషన్స్ వల్ల కూడా ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక లైగర్ సినిమా కూడా రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్నా కూడా ఖుషి సినిమా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో ఈసినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా కొత్త షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో మొదలుకానుందని సమాచారం.

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఖుషి ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచిపోయింది. మరి ఈసినిమా విజయ్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eleven =