ఈమధ్య స్టార్ హీరోయిన్లు సైతం ఒకపక్క తమ కెరీర్ ను కొనసాగిస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ కు పెళ్లిళ్లు అయిపోతే కెరీర్ ఉండదన్న భావనతో కొంచం లేటుగా పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. పెళ్లిళ్లు అవుతున్నా కూడా ఇంకా స్టార్ హీరోయిన్లుగానే కొనసాగుతున్నారు. హీరోయిన్లుగా ఇంకా వారితో సినిమాలు చేయడానికి మేకర్స్ ఏమాత్రం వెనుకాడట్లేదు. ప్రస్తుతం ఎంతోమంది హీరోయిన్లు ఆ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుంటా అంటుంది. ఆహీరోయిన్ ఎవరో కాదు మిల్కీబ్యూటీ తమన్నా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా ఇప్పుడు తెలుగు సినిమాలకు కాస్త దూరమైందని చెప్పొచ్చు. కానీ తన కెరీర్ కు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఇతర భాషల్లో పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా పెళ్లిపై స్పందిస్తూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తమన్నా. నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు. ఇన్నాళ్లు సినిమాల బిజీలో పడి నా పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే, నేను త్వరలోనే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలనుకుంటున్నాను’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. మరి దీనిబట్టి త్వరలోనే తమన్నా పెళ్లి చేసుకుంటుందని అనిపిస్తుంది. చూద్దాం మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో…
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























