కార్తీ సర్దార్ ట్రైలర్ అప్ డేట్

karthi sardar movie trailer update, sardar movie trailer update, karthi sardar movie trailer, sardar movie trailer, Karthi, RaashiiKhanna, PS Mithran, karthi Latest Movie, karthi's Upcoming Movie, sardar, sardar Telugu movie, sardar New Update, sardar Telugu Movie New Update, sardar Movie, sardar Latest Update, sardar Movie Updates, sardar Telugu Movie Live Updates, sardar Telugu Movie Latest News, sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విభిన్నమైన సినిమాలు చేయడంలో తమిళ్ హీరో కార్తీ కూడా ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా విరమన్ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. అభిమన్యుడు మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా సర్దార్. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇటివలే విడుదలైన ‘సర్దార్’ టీజ‌ర్‌ కి అన్ని వర్గాల ప్రేక్షల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లో కార్తీ విభిన్నమైన గెటప్స్ , పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికోసం డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈసినిమా ట్రైలర్ ను రేపు అంటే అక్టోబర్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు.

కాగా ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. రజీషా విజయన్‌, లైలా, యోగి సేతు, మునీష్కాంత్‌, మాస్టర్‌ రిత్విక్‌, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఈసినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అన్నపూర్ణ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.