చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తరువాత హీరోగా మారి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు శివకార్తికేయన్. మొదటి నుండీ విభిన్నమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే తనకు సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక తమిళ్ లో ఎలా అయితే స్టార్ హీరో రేంజ్ అందుకున్నాడో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పై కూడా ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే తన డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు శివకార్తికేయన్. అందుకే ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుదామని ప్రయత్నం చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శివ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రిన్స్. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఏకకాలంలో తెరకెక్కించారు ఈసినిమాను. ఇక ఈసినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు.

కాగా ఈసినిమాలో శివకార్తికేయన్ సరసన మారియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో శివ కార్తికేయన్ తెలుగు స్ట్రైట్ హిట్ అందుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































