బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్టోబర్ మొదటి వారం లో హరి హర వీరమల్లు సెట్స్ లో జాయిన్ కానున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ఆఫీస్ లో దసరా నవరాత్రి పూజ నిర్వహించారు. ఉదయం పూజ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సినిమా షూటింగ్స్ తో పాటు పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























