సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక జయాపజయాలతో పనిలేకుండా ప్రస్తుతం చాాలా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఆయన లిస్ట్ లో దాదాపు అరడజను సినిమాలు పైగా ఉన్నాయి. అందులో ‘CSI సనాతన్’ ఒకటి. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ కనిపించాడు. ఏ క్రైమ్ సీన్ అయినా ఇట్టే సాల్వ్ చేసే సీఎస్ఐ సనాతన్గా ఆది ఈ చిత్రంలో కనిపించనున్నాడు. వాళ్ళకి అక్కడ దొరికే ఎవిడెన్స్ ఫోరెన్సిక్ లాబ్ టెక్నీషియన్స్ ఇవ్వగానే.. వాళ్ళు వాటిని ఎగ్జామిన్ చేసి మ్యాక్సిమమ్ కేస్‌లను సాల్వ్ చేస్తారు అంటూ సీఎస్ఐ అంటే ఎవరు అనే దానికి వివరణ ఇచ్చారు.
Here is an Intense Peek of What is C.S.I #CSISanatan & Team in Action
▶️ https://t.co/SiOvfTy1Ku@iamaadisaikumar @NarangMisha @ActorAliReza @ImNandiniRai @AjaySrinivasOFC @dev_sivashankar @chagantiproducs @ShekarPhotos #AneeshSolomon @adityamusic @GskMedia_PR pic.twitter.com/WfD3zOxJAG
— Aadi Saikumar (@iamaadisaikumar) September 27, 2022
కాగా ఈసినిమాలో ఆదికి జోడీగా మిషా నారంగ్ హీరోయిన్గా నటిస్తుంది. అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప, మధు సూదన్, వసంతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా జిశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనీష్ సోలోమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























