టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ అప్ డేట్ కై చాల రోజులుగా అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ ను చిత్ర యూనిట్ అందించింది. ఆదిపురుష్ మూవీ టీజర్ ఉత్తరప్రదేశ్ అయోధ్య లో అక్టోబర్ 2 వ తేదీ రిలీజ్ కానుందనీ , హీరో ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొంటుందనీ సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























