స్టార్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు అన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల ముందు అనుకున్న ఈసినిమా కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్లు పట్టింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనలే ఉన్నాయి. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఈనెల 30వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. దానికి ఇంకా చాలా తక్కువ రోజులే ఉండటంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఇక ఈ సినిమాను ఎంత భారీ బడ్జెట్ తో అయితే చిత్రీకరించారో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతే గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్ర బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకలో పాల్గొన్న కార్తి మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు తీసినప్పుడే సినిమా ఎంత గొప్ప మీడియం అన్న విషయం అర్థమవుతుంది.. మనందరినీ సినిమానే కలిపి ఉంచుతోంది. మణిరత్నం గారి 40 ఏళ్ల కల ఈ సినిమా. ఇది ‘బాహుబలి’లా ఉంటుందా అని అంతా అడుగుతున్నారు. ఒక గొప్ప నవలని మణిరత్నంగారు ఈ సినిమాగా తీశారు. ఇంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రొమాన్స్ .. అడ్వెంచర్ .. రాజకీయపరమైన కుతంత్రాలు అన్నీ ఉన్నాయి. ఈ సినిమాకి తెలుగు డైలాగ్స్ చెప్పడం అంత తేలిక కాదు .. ఎన్టీఆర్ గారిని గుర్తుపెట్టుకుని చెప్పాను” అంటూ ముగించారు.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి ఈసినిమా మణిరత్నంకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: