నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాను సైన్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. ఇక ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ అమితాబ్ తోనే మొదలుపెట్టారు మేకర్స్. అమితాబ్ బచ్చన్ షూటింగ్ నే మొదట పూర్తి చేశారు కూడా. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమితాబ్ తన లుక్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసినిమాలో తన పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని.. తన లుక్ ప్రతి ఒక్కరికీ షాకింగ్ ను కలిగిస్తుందని తెలిపాడు. తన మేకప్ కే దాదాపు రెండు గంటలు టైమ్ పట్టేదని తెలిపాడు. మరి అమితాబ్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని తన భాగం షూట్ కూడా స్టార్ట్ చేసింది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: