పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ గుడ్ బై , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Papa aur main, aa rahe hai aapke family se milne on 7th October! 🤍🌸#Goodbye #GoodbyeOnOct7@SrBachchan @Neenagupta001 @pavailkgulati @ElliAvrRam @AshishVid @whosunilgrover #SahilMehta #GoodCo #VirajSawant #ShobhaKapoor pic.twitter.com/bNpQ7KJOS8
— Rashmika Mandanna (@iamRashmika) September 3, 2022
బాలాజీ మోషన్ పిక్చర్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై వికాస్ బహల్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ , రష్మిక ప్రధాన పాత్రలలో కామెడీ డ్రామా గుడ్ బై హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గుడ్‌బై మూవీలో తన పాత్రకు రష్మిక స్వంతంగా డబ్బింగ్ చెప్పుకొనడం విశేషం. గుడ్ బై హిందీ మూవీ రిలీజ్ డేట్ ను రష్మిక సోషల్ మీడియా లో అనౌన్స్ చేశారు. పాపా , తాను మీ కుటుంబాలను కలవడానికి అక్టోబర్ 7 వ తేదీ వస్తున్నామని రష్మిక ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























