అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్.. శివ సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈసినిమా విజన్ ఏంటో ఇప్పటికే అయాన్ అలానే రాజమౌళి కూడా వీడియోల ద్వారా తెలియచేశారు. ఆ విజువల్ వండర్ ను స్క్రీన్ పై చూడటమే ఆలస్యం. దానికోసమే అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ముఖ్యంగా సౌత్ లో మంచి బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి సౌత్ రాజమౌళి ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి రాజమౌళి కూడా ఎక్కడా తగ్గకుండా సౌత్ ఆడియన్స్ కు ఈసినిమా కనెక్ట్ అవ్వడానికి తను చేయాల్సిన ప్రమోషన్స్ తను చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ లోని ఫిలిం సిటీలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే గణేష్ ఉత్సవాల బందోబస్తులో పోలీస్ సిబ్బంది బిజీగా ఉండడంతో అనుమతి ఇవ్వలేదు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా జూ.ఎన్టీఆర్ హాజరుకావాల్సి ఉంది.
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలనుకున్న అభిమానులకు ముందు క్షమాపణలు తెలుపుతున్నాను. మీడియాను కూడా క్షమించమని వేడుకుంటున్నానని అన్నారు. వినాయక విగ్రహ నిమజ్జనం కారణంగా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు చెప్పారని, వారు ఉండేది మన భద్రత కోసమే కాబట్టి వారు చెప్పింది వినడం మన ధర్మమని పేర్కొన్నారు. వారికి తాము సహకరించామని, అందుకనే ఇలా చిన్న వేదికపై నుంచి మాట్లడాల్సి వస్తోందని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























