ఏ ఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.హరిహర వీరమల్లు మూవీ లోని ఒక భారీ యాక్షన్ సీన్ కై ఒక ప్రత్యేకమైన సెట్ ను మేకర్స్ రెడీ చేయించారు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం విదేశీ నిపుణులు కూడా పని చేస్తుండటం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా పవర్ గ్లాన్స్ వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఒక కొత్త పోస్టర్ తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ .. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ దాదాపు 60 శాతంకంప్లీట్ అయిందనీ , త్వరలోనే కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందనీ చెప్పారు. తాజాగా హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ వీడియో రిలీజ్ అయ్యింది. అద్భుతమైన విజువల్స్ తో పవర్ ప్యాక్డ్ గా రూపొందిన పవర్ గ్లాన్స్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























