ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో ప్రభాస్ కెరీర్ లో మొదటిసారి రాముడిపాత్రలో నటిస్తుండటంతో ఈసినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. షూటింగ్ తొందరగా అయిపోయినా కూడా భారీ విఎఫ్ఎక్స్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కే ఎక్కువ టైమ్ పడుతుండటంతో రిలీజ్ లేట్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా కాలం అవుతుంది. సినిమా ప్రారంభమైన మొదట్లో పలు అప్ డేట్లు ఇచ్చినా ఆతరువాత నుండి ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. ఇప్పటికే చాలా కాలంగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే అప్ డేట్ ఇవ్వమని కోరుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే అక్టోబర్ నుండి ఈసినిమా ప్రమోషన్స్ భారీగా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. టీజర్, పాటలు, పోస్టర్లు ఇలా వరుస అప్ డేట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. జనవరిలో రిలీజ్ అవుతుంది కాబట్టి కనీసం ఒక రెండు మూడు నెలలు అయినా గట్టిగా ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారట.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























