వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. సీతారామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీతారామం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ,ఆ మూవీ లో సీత పాత్రలో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్ కు ఒక తెలుగు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఈ మూవీ లో మృణాల్ కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























